Thursday 19 February 2015

బంకింగ్ క్వీన్

బంకింగ్  క్వీన్ 

                                          ఎవరో  అనుకునేరు  నేనే ... చిన్నప్పుడు స్కూల్  బంక్  చేయడం లో నేనే ఫస్ట్ ... మా అమ్మ నాన్న పాపం నాతో చాలానే వేగారు నన్ను వేయించారు కూడా... 


        అలా  వాళ్ళతో  వేగుతూ  కూడా  తప్పించుకుని స్కూల్ బంక్  కొట్టేదాన్ని  అలా రోడ్ల పై  తిరుగుతూ స్కూల్  టైం అయిపోగానే  ఏమి తెలియనట్టు ఇంటికి వెళ్లి అమ్మ తో ఆరోజు చాలా కష్టపడ్డట్టు బిల్డ్డప్  ఇచ్చేదాన్ని  అందులో కూడా మనం ఫస్ట్ లెండి ... 

         స్కూల్ ఎగ్గొట్టడానికి ఎన్ని మార్గాలు అన్ని ఉన్నాయో అన్ని కనుక్కోవడమే నా రోజువారి  పని... 
అందులో భాగంగా  నా రీసెర్చ్ లో కొన్ని నేను తెల్సుకున్నవి మీకు చెప్తాను ... 
        సినిమాలు చూసి అన్ని నమ్మేయోద్దు  ఎందుకంటే  నా చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది  అది సీతాకోకచిలుక సినిమా ... మీకు గుర్తుండే ఉంటుంది అందులో ఒక సీన్ లో  హీరో హీరోయిన్  ఇద్దరు  జ్వరం రావడానికి  ఉల్లిపాయ తొక్కలు వాడతారు  నాకు తెల్సి 90'స లో పుట్టిన అందరు పిల్లలు ఆ  మెథడ్  ట్రై  చేసే ఉంటారు కాని అది నా విషయం లో పని చేయలేదు  అప్పుడు నాకు ఆ సినిమా పైన ఆ సినిమా తీసిన వారి పైన చాలా చాలా కోపం వచేసింది ... అలా అబద్ధాలు చెప్పడని ... 
       
      తర్వాత ఇంకా ఏమైనా మార్గాలు ఉన్నాయా అని చాలా ట్రై చేశాను ఎండలో  నిలబడడం ,వర్షం వస్తుందా  లేదా  అని ఆకాశం వైపు చుస్తూ  ఉండడం ... 
     ఇంకా  రోజు దేవుడిని  వర్షం తెప్పించమని అడగడం (కనీసం స్కూల్ టైం ఐపోయే వరకు)
ఇవి ఏవి ఫలించకపోతే నా భ్రహ్మాస్త్రం  ప్రయోగించడమే "నాన్నా కడుపు నోస్తుంది తల నొప్పి "  అబ్బా అంటూ తల పట్టుకుని ఏడవడం .... (అదేంటోనండి  నేను కళ్ళు మూసుకుని ఏడవాలి అని ఒక 2మినిట్స్  అనుకుంటే కాళ్ళ నుండి  నీళ్ళు వచేస్తాయ్ ) మా నాన్న కి నేను ఏడిస్తే నాచదు వెంటనే అయితే ఈరోజు ఇంట్లో రెస్త్ తీస్కో  అని అనేస్తారు  స్కూల్ టైం అయ్యే వారు అమ్మ నొప్పి అయ్యా నొప్పి అని టైం  అయిపోగానే  టి.వి  పెట్టుకుని సాంగ్స్ కి డాన్ డ న క డాన్ ద న క అని ఎగిరేదాన్ని. 

                     కాని  నేను కనుక్కున్నా జ్వరం రావాలంటే ఎం చేయాలో  రియల్లీ  పని చేసింది ...
మీరు ట్రై చేయండి ... అది ఏంటంటే ...


             ఒక పారాసెటమాల్  టాబ్లెట్ నైట్ వేస్కొని బ్లాంకెట్ నిండుగా కప్పుకుని  పడుకోండి తెల్లారే వరకి  102 ఉంటుంది .... ట్రై చేయండి డౌట్ ఉంటె ... ఒట్టు .... ఇది నిజమ్...


3 comments: